Andhra PradeshHome Page Slider

‘పవన్ స్వామి గారూ… దమ్ముంటే ఈ పనులు చేయండి’..రోజా ఘాటు వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారంపై మాజీ మంత్రి రోజా నిలదీశారు. పవన్ స్వామిగారూ దమ్ముంటే ఈ పనులు చేయగలరా అంటూ సవాల్ విసిరారు. మీరు అరవాల్సింది నడిరోడ్డుపై కాదు, విశాఖ స్టీలు కార్శికుల కోసం, బొట్లు పెట్టాల్సింది గుడి మెట్లకు కాదు, బడిమెట్లకు అంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు పవన్ చేస్తున్న పనులను నిలదీస్తూ రోజా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.  పవన్ నియోజక వర్గం పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం గురించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.