పవన్ వాలంటీర్ల కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి:మంత్రి రోజా
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి రోజా ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌తో వాలంటీర్లపై విషం చిమ్మిస్తున్నారన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలకుగాను..ఆయన వాలంటీర్ల కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు సంతోషంగా ఉండటాన్ని చూసి పవన్ తట్టుకోలేక పోతున్నారన్నారు. అందుకే ఆయన ఎప్పుడూ..ఇరిటేషన్ స్టార్ అని రోజా ఎద్దేవా చేశారు. ఏపీలో మహిళల మిస్సింగ్ అంటూ దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని ఆమె పవన్‌ను దుయ్యబట్టారు. తన నియోజక వర్గంలో వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్ కళ్యాణ్‌కు రిపోర్ట్ ఎవరు ఇచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు.