Andhra PradeshHome Page Slider

సీట్ల సర్దుబాటుకు సంబంధించి చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు విషయంలో ఇవాళ మరోసారి భేటీ అయ్యారు. మొదటి విడతలో టీడీపీ 94, జనసేన 5 సీట్లను ఖరారు చేయగా, ఆ తర్వాత జనసేన కొన్ని సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వచ్చింది. టీడీపీ సైతం రెండో లిస్టులో 34 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. మొత్తంగా టీడీపీ ఇప్పటి వరకు 128 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయగా.. జనసేన, బీజేపీకి 31 స్థానాలు కేటాయించింది. టీడీపీ 16 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉండగా, జనసేన, బీజేపీ పూర్తి స్థాయి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. సీట్ల సర్దుబాటు పూర్తయిన వెంటనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని భావిస్తున్నారు. చంద్రబాబు ఈనెల 26 నుంచి, పవన్ కల్యాణ్ 27 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోపైనా ఇద్దరు నేతలు యోచిస్తున్నారు. బీజేపీ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందిస్తున్నది చూడాలి.