Andhra PradeshHome Page Slider

ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌తో పవన్ భేటి

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ మురళీధర్‌తో భేటి అయ్యారు. కాగా వీరిద్దరు ఏపీలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. కాగా కాసేపట్లో పవన్ కీలకమైన భేటిలో పాల్గొననున్నారు. పవన్ కేంద్ర మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారనున్నట్లు కన్పిస్తోంది. కాగా దేశంలోని పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.