పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎవ్వరూ సాధించని రికార్డు నెలకొల్పారు. ఆయన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శాఖ ఒక ప్రపంచరికార్డును సాధించింది. ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 13,326 పంచాయితీలలో గ్రామసభలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డ్ యూనియన్ గుర్తింపు పొందారు. దీనికి గాను ఆయనకు పత్రాన్ని, మెడల్‌ను సంస్థ ప్రతినిధులు అందించారు. ఒక్కరోజులో ఇంత విస్తృత స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభను నిర్వహించడం ఇంతకు ముందెన్నడూ జరగలేదని, దీనిని అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.

ఆయన గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా 21 స్థానాలలో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి, అన్ని స్థానాలలో ఓటమి లేకుండా గెలుపొందారు. పోటీ చేసిన అన్ని స్థానాలలో ఒక పార్టీ గెలుపొందడం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో పెద్ద రికార్డుగా పేర్కొనబడింది.

