ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ వినాయకుడు..
ప్రస్తుతం యువత ఏ ట్రెండింగ్ నడుస్తోందో ఆ ట్రెండింగ్ నే ఫాలో అవుతున్నారు. ట్రెండ్ అవుతున్న హీరోని పోలినట్లుగా వినాయకుడి విగ్రహాలు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఒక్కరని కాకుండా తెలుగులో చాలా మంది హీరోలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుపుకున్న వినాయక చవితి ఉత్సవాలలో పవన్ కళ్యాణ్ ను పోలిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. గతంలో జాలర్ల కోసం పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఒక చేతిలో వల, మరో చేతిలో జాలరి గంప పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు అదే ఫోటోను ఆధారంగా చేసుకుని ఒక విగ్రహాన్ని ఫిషింగ్ హార్బర్ వర్కర్లు తయారు చేసి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పవన్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరో వైపు హిందూ సంఘాల వారు విమర్శలు చేస్తున్నారు. దేవుడికి ఇలాంటి వింత ఆకారాల్లో విగ్రహాలు పెట్టడం తగదని తేల్చి చెబుతున్నారు. మరికొందరైతే ఇదేం పిచ్చి రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.