Andhra PradeshHome Page Sliderhome page slider

పవన్ కళ్యాణ్ ప్రకటన సరికాదు..

థియేటర్ల బంద్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేగిన విషయం అందరికీ తెలిసిందే. ఎగ్జిబిటర్లకు, ప్రొడ్యూసర్లకు మధ్య మొదలైన ఈ వివాదంలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో మరింత ముదిరింది. ఈ అంశంపై సీనియర్ నటుడు, డైరెక్టర్ ఆర్. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై కుట్రలు చేయలేదని.. పవన్ కళ్యాణ్ ప్రకటన సరికాదని అన్నారు. పవన్ కల్యాణ్‌పై ఎవరు కుట్రపన్నగలరని ప్రశ్నించారు. థియేటర్ల బంద్ అనే విషయాన్ని ఎవరూ ప్రకటించలేదని స్పష్టం చేశారు. దీనిపై పవన్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మాటలు సరికాదని ఆర్. నారాయణమూర్తి హితవు పలికారు. మరోవైపు గద్దర్‌ అవార్డులు ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోనూ అవార్డులు ప్రకటించాలని నటుడు నారాయణమూర్తి ప్రభుత్వానికి కోరారు.