వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ పరుష వ్యాఖ్యలు
వైసీపీ-జనసేన మధ్య యుద్ధం ఇప్పుడు పతకా స్థాయికి చేరుకొంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలను, సీఎం జనగ్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న తీరుకు పూర్తి భిన్నంగా రియాక్ట్ అయ్యారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు అటు తిప్పి.. ఇటు తిప్పి కొడతా కొడకల్లారా అంటూ దుయ్యబట్టారు పవన్ కల్యాణ్…ఎదవల్లారా.. సన్నాసుల్లారా.. దద్దమ్మల్లారా అంటూ తిట్టిపోశారు. సహనం ఇన్నాళ్లూ మిమ్మల్ని రక్షించిందంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైసీపీ గుండాగాళ్లారా.. మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా.. రౌడీలున్నారా అంటూ దుయ్యబట్టారు. ఒంటి చెత్తే వచ్చి మెడపిసికి తొక్కేస్తానన్నారు.