చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన
బంగ్లాదేశ్‌లో అరెస్టయిన ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది చాలా విచారించదగిన విషయమని, దీనిపై హిందువులందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం పాత్ర ఎంతో ఉందని, ఎందరో భారతీయులు రక్తం చిందించారని, దేశ సంపదను వెచ్చించారని మరిచిపోవద్దని హితవు చెప్పారు.

