Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖాయం

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఖాయమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన గౌరవం తగ్గకుండా ఇంకెవరికీ మరో డిప్యూటీ సీఎం పదవి లభించడం లేదని, ఏపీకి ఆయనొక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని సమాచారం. గతంలో టీడీపీలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. జగన్ హయాంలో కూడా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించమని మూడు పార్టీల నాయకులు నేడు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన నుండి మరో ముగ్గురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. బీజేపీకి కూడా 2 మంత్రు పదవులు లభిస్తాయని సమాచారం.