ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పదవి ఇదేనా..?
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.అయితే ఈ ఘనవిజయాన్ని సాధించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్‌గా కీలక పాత్ర పోషించారు.కాగా జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేటుని సాధించి దేశ రాజకీయాల్లో రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కు ఏ పదవి దక్కుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.కాగా దీనిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారు. కాగా రిపోర్టర్ పవన్‌కు ప్రభుత్వంలో ఏ పదవిపై ఆసక్తి ఉందని అడగ్గా..ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపినట్లు ఇండియా టుడే పేర్కొంది.