TTD ఈవోపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తిరుపతి తొక్కసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాల్సిందేనని, ఒప్పుకోవలసిందేనని పేర్కొన్నారు. వారు ఎంతటివారైనా సరే, చివరికి తానైనా సరే తప్పు చేస్తే శిక్షించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అందుకే తాను క్షమాపణలు చెప్పానని, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈవో వెంకయ్య చౌదరి కూడా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అధికారులు తప్పు చేస్తే ప్రజలు ప్రశాంతంగా పండుగ చేసుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తప్పు ఒప్పుకోవడానికి నామోషీ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అనేకసార్లు చెప్పానని పేర్కొన్నారు.

