చేబ్రోలులో పవన్ కళ్యాణ్ ఉండే ఇల్లు
గొల్లప్రోలు: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆయన నివసించే భవనానికి రిపేర్లు చేస్తున్నారు. చోబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో దీన్ని సెలెక్ట్ చేశారు.