డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలి సంతకం వీటిపైనే..
ఏపీ డిప్యూటీ సీఎంగా అలాగే పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS ,పర్యావరణ,శాస్త్ర సాంకేతిక,అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండు ఫైళ్లపై సంతకాన్నిచేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంతకం చేసిన ఆ ఫైళ్లు ఏంటో తెలుసుకోవాలని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మంత్రిగా పవన్ కళ్యాణ్ తన మొదటి సంతకాన్ని ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధులు మంజూరుపై చేసినట్లు తెలుస్తోంది. కాగా తన రెండవ సంతకాన్ని పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పంచాయితీ భవనాల నిర్మాణాలపై చేశారు.

