జగన్ సారా వ్యాపారి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రి జగన్ సారా వ్యాపారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ తీరుతో ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పారిపోతున్నాయన్నారు. అమరరాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కడ్నుంచి వెళ్లిపోయాయన్నారు. జగన్ రావణుడిలా మారి రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారన్నారు. త్వరలో రావణ సంహారం జరుగుతుందన్నారు. త్వరలో రామరాజ్యస్థాపన జరుగుతుందన్నారు. డబ్బు అండ చూసుకొని జగన్ ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారన్నారు. జగన్‌ను ఇంటికి పంపితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు పవన్ కల్యాణ్. ఎన్డీఏ కలయిక ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందాన్నిస్తుందన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతుందన్నారు. ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని, చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందన్నారు. దుర్గమ్మతల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

