విడాకులు తీసుకునేందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు:అంబటి
ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ ఢిల్లీకి వెళ్లారని ఆయన ఆరోపించారు. కాగా బీజేపీతో తన బంధం తెంచుకోమనే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీకి పంపించారన్నారు. ఏపీలో కాపు ఓట్లను చీల్చేందుకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏపీలో పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పినవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని అంబటి ప్రశ్నించారు. కాగా ఈ సంచలన వ్యాఖ్యాలతో అంబటి రాంబాబు ఏపీలో మరోకొత్త రాజకీయ రణరంగానికి తెరతీసినట్లు కన్పిస్తోంది.


 
							 
							