Andhra PradeshHome Page Slider

రేపు చంద్రబాబునాయుడికి పవన్ కల్యాణ్ పరామర్శ

ప్రస్తుతం రాజమండ్రి జైలులోని స్నేహా బ్లాక్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలవడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు రాజమండ్రి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో జనసేన అధినేత చంద్రబాబుకు మద్దతు తెలపడంతోపాటు, సంఘీభావం ప్రకటించనున్నారు. ఇద్దరు ప్రముఖ నేతల మధ్య జరగనున్న భేటీ విశేష దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్న పవన్ కల్యాణ్, జైలు అధికారులు నిర్దేశించిన సమయానికి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుపుకునేలా చూడాలని ఇప్పటికే పవన్ జైలు అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ పర్యటనలో చంద్రబాబు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.