విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై.. పవన్ కళ్యాణ్ ట్వీట్
ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం దేశవ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా ఈ ప్రైవేటికరణ అంశాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ తెలుగు వారికి ఓ ఎమోషన్ అని అన్నారు. కాగా ఇది తెలుగు వారి త్యాగం,గౌరవం,స్పూర్తికి చిహ్నమని పేర్కొన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రభుత్వం చేతిలోనే ఉండి లాభాలు తీసుకురావాలన్నారు. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్‌లను మంజూరు చేసేలా పునరాలోచించిన కేంద్రానికి ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా దశాబ్దాల కిందట స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేసిన అమృతరావు సేవలను పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు తాజాగా తెలంగాణా ప్రభుత్వం కూడా మంతనాలు జరిిపిన విషయం తెలిసిందే.