Andhra PradeshHome Page Slider

మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సచివాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాగా హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆయన విజయవాడలో తనకు కేటాయించిన ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకొని భవనాన్ని పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. అయితే ఈ రోజు 3 గంటలకు పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లి అక్కడ 2వ బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. కాగా రేపు సచివాలయంలో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.