ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ
ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇవాళ 10: 47 గంటలకు ఆయన క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు పవన్ కళ్యాణ్‌కు ఆశీర్వచనాలు అందించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. మరి కాసేపట్లోనే ఆయన ఐఏఎస్,ఐపీస్ అధికారులతో భేటీ కానున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గ్రూప్-1,2 ఆఫీసర్లతో కూడా సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఈ రోజు మధ్యహ్నం ఆయన పంచాయితీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులోనే బస చేయనున్నట్లు సమాచారం.డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో పవన్ కళ్యాణ్‌కు జనసేన ,టీడీపీ నేతలతో పాటు పలువురు అధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.