తీవ్రజ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్-కార్యక్రమాలన్నీ రద్దు
జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. 102 డిగ్రీల జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నారని, ఈరోజు కార్యక్రమాలు నిర్వహించలేరని జనసేన నేతలు తెలియజేశారు. ఉభయగోదావరి జిల్లాలలో గత కొన్ని రోజులుగా పవన్ వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అమలాపురం, పిఠాపురం,భీమవరం వంటి నగరాలలో సభలు, సమావేశాలు నిర్వహించారు. మంగళవారమే ఆయన కొంత అస్వస్తతకు గురయ్యారు. దీనితో మంగళవారం ఉదయం కూడా ఉభయగోదావరి జిల్లాలలోని జనసేన నాయకులతో, కార్యకర్తలతో జరగవలసిన మీటింగ్‌ను రద్దు చేసుకున్నారు. సాయత్రం యధావిధిగా సభలో పాల్గొన్నారు. కాగా ఈరోజు చాలా నీరసంగా ఉన్నారని, బాగా విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. పవన్ డీహైడ్రేషన్‌తో కూడా బాధపడుతున్నారని, వారాహి నవరాత్రుల కారణంగా గత ఏడు రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్నారని, దీనితో శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయాయని వెల్లడించారు. దీనితో ఆయనకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు.