భార్య కోసం పవన్ కళ్యాణ్ సింగపూర్ టూర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగపూర్‌కి వెళ్లినట్లు సమాచారం. ఎందుకంటే తన భార్య అన్నా లెజినోవా అక్కడి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందింది. ఈ పట్టభద్రుల వేడుకకు పవన్, అన్నా లెజినోవా హాజరయినట్లు ఫోటోలను సోషల్ మీడియాలలో పోస్టు చేస్తున్నారు అభిమానులు. ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు పవన్ కూడా సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది.