Andhra PradeshHome Page Slider

‘మా పెళ్లి పవన్ కళ్యాణే చేయాలి’..యువకుడి డిమాండ్

ఏపీలో యువ రైతులకు పెళ్లిళ్లు అవడం లేదని వాపోతున్నాడు నవీన్ అనే యువకుడు. ఈ సమస్య పరిష్కారానికి ఏపీలోని సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఉండే ఈ యువ రైతు వినూత్న ఆలోచన చేశారు. యువరైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చెయ్యాలనుకుంటున్నాడు. దీనితో ఎడ్లబండి కట్టుకుని, రోజుకు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ హిందూపూర్ నుండి అమరావతికి ప్రయాణం కట్టాడు. బండికి పోస్టర్లు కట్టి, రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. ప్రజలకు అన్నం పెట్టేది రైతేనని, వారికి గుర్తింపు కావాలని కోరుతున్నారు నవీన్. తమలాంటి యువ రైతులకు పెళ్లిళ్లు కావడం లేదని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు చైతన్యం కలిగించాలని కోరుతున్నాడు.