పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి:వైసీపీ మంత్రి
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిలో భాగంగానే ఏపీలో వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై వైపీసీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు విధివిధానాలు లేవని విమర్శించారు. వాలంటీర్లపై పవన్ వాఖ్యాలు బాధాకరమన్నారు. ఈ మేరకు పవన్ తక్షణమే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కారుమూరి డిమాండ్ చేశారు. కాగా వాలంటీర్ల వ్యవస్థతో ఏపీలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల నుంచి సీఎం జగన్‌ను ఎవరూ విడదీయలేరని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.