Home Page SliderNational

తమిళ ఇండస్ట్రీపై  పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టిస్టారర్ సినిమా “బ్రో”.ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తమిళ ఇండస్ట్రీకి ఓ విన్నపం చేశారు. కాగా పవన్ మాట్లాడుతూ…తమిళ ఇండస్ట్రీలో తమిళ వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి అనే దాని నుంచి తమిళ వాళ్లు బయటికి వస్తే బాగుంటుందన్నారు. తెలుగు పరిశ్రమ అందరి నటులను తీసుకుంటుందని అన్నారు. అలాగే తమిళ పరిశ్రమలో కూడా అందరిని తీసుకోవాలని పవన్ కోరారు. తమిళ పరిశ్రమ తమిళ వాళ్లకే అంటే పరిశ్రమ ఎప్పటికీ అభివృద్ధిలోకి రాదన్నారు. తెలుగు పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుగుతుందంటే దానికి కారణం అందిరిని ప్రోత్సహించడమేనన్నారు. తెలుగు పరిశ్రమ భాష,ప్రాంతంతో సంబంధం లేకుండా అందరినీ తీసుకుంటోంది కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిందన్నారు. తమిళ పరిశ్రమ కూడా అందరినీ ప్రోత్సహిస్తే బాగా అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు త్వరలో తమిళ ఇండస్ట్రీ నుంచి RRR లాంటి ప్రపంచ ప్రఖ్యాతి సినిమా రావాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తమిళ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ బ్రో సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.