Andhra PradeshNews

ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందన్న పవన్

వైసీపీలో అందరు నీచులే ఉండరు..కానీ వైసీపీలో నీచ సమూహం ఎక్కువని పవన్‌కళ్యాణ్ ఆరోపించారు. జనసేన దగ్గర పోరాట పటిమ ఉందన్నారు.  మమ్మల్ని పోలింగ్ బూత్ దగ్గర నిలబడటమంటే యుద్దం చేసినట్టేనని పవన్‌కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం కొన్ని కులాలకే పరిమితమైందన్నారు. బడుగులకు కూడా అధికారం రావాలన్నారు. దానికోసమే జనసేన పనిచేయాలి అని పవన్ పిలుపు నిచ్చారు.  రాష్ట్రంలో బడుగులు ఎదగడానికి నా జీవితాన్ని ఫణంగా పెడతానన్నారు. బలిజ,కాపు ,ఒంటరి,తెలగ సామాజిక వర్గాలకు..బలం ఉంది కానీ అధికారం లేదనే బాధ ఉంది. కానీ అధికారం దక్కించుకునేందుకు ఏం చేశారన్నారు. వైసీపీలోని కాపు నేతలు కులాన్ని లోకువ చేయొద్దని పవన్ సూచించారు. ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని పవన్‌కల్యాణ్ తెలియజేశారు.