“తప్పు చేస్తే నన్నయినా ప్రశ్నించండి”:పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక పవన్ తొలిసారి పిఠాపురంలో పర్యటిండడం విశేషం. అయితే ముందుగా గొల్లప్రోలులో జరిగే ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. అవినీతి చేయనని ప్రజలకు మాటిస్తున్నా అన్నారు. కాగా తాను డబ్బు వెనకేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖలోను పారదర్శకత,జవాబుదారీతనం తీసుకు వస్తానని పవన్ హామీ ఇచ్చారు. తప్పు చేస్తే నన్నాయినా సరే ప్రశ్నించండి ఆయన ప్రజలకు సూచించారు. అయితే మాకు ఓటు వేయకపోయినా సరే ఏ పార్టీ వారైనా వారికి ప్రశ్నించే హక్కు ఉందని పవన్ తెలిపారు. అయితే తాను హంగులకు,ఆర్భాటాలను పోను అని పవన్ స్పష్టం చేశారు.కాగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 620 గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. అయితే ప్రతి సచివాలయంలో కూడా 10మంది ఉద్యోగులున్నారని పవన్ వెల్లడించారు.దీంతో గతంలో 4 రోజుల్లో ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఒక్క రోజులోనే ఇస్తున్నామన్నారు.కాగా రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారన్నారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్ ఎక్కడ ఆగిందని పవన్ ప్రశ్నించారు.