మల్కిపురంలోని భారీ సభలో అవినీతిపరులని తరిమికొడదామన్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణా్ వారాహి యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలలో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని దృఢనిశ్చయంతో ఉన్నారు పవన్. ఆదివారం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కిపురం సెంటర్లో భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. నేరమయ రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు జనసేనను స్థాపించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అవినీతి పరులను తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. అవినీతిపరులని ప్రజలే ఆపాలి, ఎన్నికల్లో ఓడించాలి, రాక్షసులపై యుద్ధానికి ఏ దేవుడు దిగి రాడు మనిషి రాక్షసులను ఎదుర్కోవాలి.ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మార్పు తేవాలని ఆయన పిలుపునిచ్చారు.

గాంధీ అంబేద్కర్ ల గురించి చిన్ననాటి నుంచి అవగాహన చేసుకున్న తామంతా అవినీతిపరుల ఏలు బడిలో జీవించటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను బ్రతికున్నంత కాలం నేరస్తులను ఎదిరిస్తూనే ఉంటానన్నారు. రాజకీయాల నుంచి నేరస్తులును సమూలంగా నిర్మూలించటమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందుకోసం తానంతకైనా తెగిస్తానన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ తెగిస్తే లక్షలాదిమంది జనసైనికులు తెగించి రాజకీయాల్లోని అవినీతిపరులు నేరస్తులను నేలమట్టం చేస్తారన్నారు. రాబోయే ఎన్నికలని ఆ ధర్మంపై ధర్మం చేసే పోరాటంగా ఆయన అభివర్ణించారు.ధర్మాన్ని నిలబెట్టేందుకు తాను యుద్ధం చేస్తున్నానన్నారు. వారాహి అంటే యుద్ధానికి అధిదేవత. అలాంటి వారాహిలో అవినీతిపై ధర్మయుద్ధం చేస్తున్నానని ప్రజలందరూ సహకరించారని కోరారు పవన్.

