Andhra PradeshHome Page Slider

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు- పవన్ కల్యాణ్ జోస్యం

రానున్న సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారని ఆ యుద్ధంలో మీరు ఓడిపోవడం ఖాయమని టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం తధ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారని కానీ కేవలం 15 సీట్లకే ప్రజలు పరిమితం చేయనున్నారని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారాహి యాత్ర నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ఆదివారం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ కురుక్షేత్ర యుద్ధంలో తాము పాండవులమని మీరు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కౌరవులే అన్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో అంతిమ విజయం జనసేన- తెలుగుదేశం పార్టీలదే నని స్పష్టం చేశారు. ఏపీ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదని, వైఎస్సార్సీపీని దించేయడమే తమ లక్ష్యం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని స్పష్టం చేశారు.