పవన్‌కళ్యాణ్ కొత్తమూవీ అప్‌డేట్
హీరో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అంటే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది ఆయన ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్‌లో అంత ఫాలోయింగ్ ఉంది మరి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దక్షిణాదిలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పవన్‌కళ్యాణ్ కొత్తమూవీ అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్ అందరు పండుగ చేసుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “ఉస్తాద్ భగత్‌సింగ్” ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. కాగా ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 5 నుంచి ప్రారంభించాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి సెట్టింగ్ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి DSP సంగీతం అందిస్తున్నారు.