Home Page SliderNational

ట్రెండింగ్‌లో పవన్ కళ్యాణ్ సినిమాలు…

టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ, బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. తన పెండింగ్ వర్క్ కోసం మేకర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వీటికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు సెప్టెంబర్ నెలలో మళ్ళీ షూటింగ్‌ను స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు సుజీత్, హరీష్ శంకర్‌లు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి.