తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వరదల నేపథ్యంలో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు కోటిరూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు పవన్ కళ్యాణ్. అనంతరం ఏపీ, తెలంగాణ వరదలు, ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఒప్పందాలుపై చర్చించినట్లు సమాచారం.

