జేపీ నడ్డాతో మరోసారి భేటి అయిన పవన్ కళ్యాణ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటి అయ్యారు. కాగా పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులు నుంచి ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్రమంత్రులు అమిత్ షా,మురళీధరన్‌తో సమావేశం అయ్యారు. కాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ జేపీ నడ్డాతో భేటి అయ్యారు. అయితే వీరిద్దరి భేటి ఓ గంటపాటు కొనసాగింది. కాగా గంటపాటు జరిగిన ఈ భేటీలో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు,బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాత పరిణామాలను ప్రాముఖ్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సమాయత్తం అవ్వాలి అనే దానిపై పవన్ జేపీ నడ్డాతో చర్చించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.