భార్యతో కలిసి ఇటలీలో పెళ్లికి బయలుదేరిన పవన్ కళ్యాణ్..
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీల పెళ్లికోసం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఇటలీ బయలుదేరారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ ఔతున్నాయి.
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఇటలీకి బయలుదేరారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా తయారయ్యాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. న్యూ లుక్ బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ పెళ్లి నవంబర్ 1న ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లి కోసమే పవన్ ఇటలీ బయలుదేరారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన అక్కడికి వెళ్లారు. అలాగే నిన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ కూడా ఇటలీ వెళ్లారు. ఇక మెగా – అల్లు ఫ్యామిలీ సభ్యులు కూడా నేడు బయలుదేరనున్నారు.
మరోవైపు ఈ పెళ్లి సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే, ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30న కాక్‌టేల్ పార్టీతో మొదలుపెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహిస్తారు. ఇక అక్కడి నుండి తిరిగి వచ్చాక నవంబర్ 5న సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుంది. తాజాగా పెళ్లి వెడ్డింగ్ కార్డుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యింది.

