అనారోగ్యం బారిన పడిన పవన్ కళ్యాణ్
ఉభయగోదావరి జిల్లాలలో వారాహి యాత్రతో సంచలనం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ జోరుకి కాస్త బ్రేక్ పడింది. ఆయన స్వల్ప అనారోగ్యం బారిన పడ్డారు. పశ్చిమగోదావరిలోని పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం జరగవలసిన భీమవరం నేతలతో సమావేశం వాయిదా పడింది. ఈ కార్యక్రమం మధ్యాహ్నానికి వాయిదా పడింది. కాగా నేడు వివిధ పార్టీల నుండి కార్యకర్తలు, నేతలు జనసేన పార్టీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీకి ఒక్కసీటు కూడా రానివ్వనంటూ నిన్న సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయగోదావరి జిల్లాలను బాగా అభివృద్ధి పరచవలసిన అవసరం ఉందని, టూరిజంను కేరళ తరహాలో బాగా పాపులర్ చేయొచ్చని, తద్వారా ఆదాయమార్గాలను సాధించవచ్చని నిన్న మల్కిపురం సభలో అభిప్రాయపడ్డారు.

