పవన్ కళ్యాణ్ పిచ్చివాడు: పోసాని
ప్రముఖ సినీ నటుడు,రాజకీయ వేత్త పోసాని కృష్ణమురళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. కాగా ఆయన పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒకప్పడు మంచివాడని,ఇప్పుడు ఎందుకు పిచ్చివాడయ్యాడో అర్థం కావడం లేదన్నారు. పవన్ ఎంతోమందికి సాయం చేస్తుంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాయలో పడిపోయారని పోసాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడని పోసాని హెచ్చరించారు. ఏపీలో పవన్ కళ్యాణ్ MLAగా గెలుస్తాడో లేదో కూడా గ్యారెంటీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో అని మాత్రమే ప్రజలు రోడ్ షోలకు వస్తున్నారని పోసాని వెల్లడించారు. అంతేకాకుండా పవన్‌కు ఏపీలో నిజంగా సీఎం అయ్యే దమ్ము ఉంటే ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని పోసాని పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించారు. కాగా పోసాని తాజా వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కినట్లు కన్పిస్తున్నాయి.