Andhra PradeshHome Page Slider

“పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని”: మంత్రి కాకాని

ఏపీలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వీటిని తీవ్రంగా ఖండిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్‌కు తనపై,తన పార్టీపై నమ్మకం లేదన్నారు. అందుకే ఆయన ఇతర పార్టీలతో కలుస్తున్నారని మంత్రి కాకాని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పవన్ రాజకీయ అజ్ఞాని కావడంతోనే ఏపీలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అయితే ఏపీలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు చేరవేస్తున్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికావన్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి పోటి చేసే సత్తా లేకే పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి కాకాని విమర్శించారు.