పవన్ కళ్యాణ్ కొత్త సైన్యం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్నానని ప్రకటించారు. ఏలూరులో పర్యటించిన పవన్ దీనికోసం ‘నారసింహ వారాహి గణం’ అనే పేరిట జనసేనలో ఒక సైన్యాన్ని సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, అన్ని మతాలను గౌరవించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 14 ఏళ్ల కిందట ఇక్కడే భగవంతుడిని తనకు శక్తినివ్వమని వేడుకున్నానని, ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. ఈ దేశం బలమైన దేశంగా నిలబడాలంటే సనాతన ధర్మం అండగా నిలవాలని తెలిపారు. ఈ గణం తెలంగాణలోనూ, ఏపీలోనూ కూడా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు, సనాతన ధర్మ పరిరక్షణ కూడా రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ధర్మాన్ని అవమానించే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.