“ప్రజలు సీఎం పదవి ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తా”:పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఏపీలో సీఎం పదవికి తానేప్పుడు విముఖంగా లేనని,సుముఖంగానే ఉన్నానని పవన్ తెలిపారు.తాను మొదటి నుంచి రాష్ట్ర ప్రయోజనాలే ప్రదాన ప్రాధాన్యత ని చెప్తూనే ఉన్నానన్నారు. కాగా ఏపీ ప్రజలు సీఎం పదవి ఇస్తే ఖచ్చితంగా స్వీకరించడానికి నేను సిద్దం అన్నారు.ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయేలా,జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చేలా మనం పనిచేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా అందరి అభిప్రాయాల మేరకే పొత్తులపై నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది తన ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదని పవన్ కళ్యాణ్ పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు.