బీజేపీకి ఊడిగం చేయలేం-పవన్ కల్యాణ్
అమరావతి, మనసర్కార్
ఏపీలో బీజేపీ-జనసేన కూటమి మధ్య బీటలు వారినట్టుగా కన్పిస్తోంది. మొన్నటి వరకు ఉన్న రెండు పార్టీల అలయన్స్… ఇక దాదాపు అసాధ్యమన్నట్టుగా కన్పిస్తోంది. వైసీపీ సర్కారుపై పోరాటం చేయడానికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే ఇంకెంత కాలం వెయిట్ చేయాలంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్… అలా అని చెప్పి ఊడిగం చేయలేమన్నారు. స్థాయిని తగ్గించుకోలేనన్నారు. నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుందంటూ మనసులో మాట తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ పదవి కోసం ఆరాటపడలేదన్నారు. ప్రధాన మంత్రి గారినిగానీ, బీజేపీకి కాని వ్యతిరేకం కాదంటూనే అసలు విషయాన్ని చెప్పేశారు. బీజేపీకి సంబంధించినంత వరకు అలయన్స్ కుదిరినా బలంగా పనిచేయలేకపోయామన్నారు. రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే కాలం గడిచిపోతోందన్నారు. రౌడీలు రాజ్యామేలుతుంటే.. గుండాలు గదమాయిస్తుంటే ప్రజలను రక్షించుకోడానికి నేను వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుందన్నారు. అంత మాత్రన బీజేపీకి వ్యతిరేకం కాదన్నారు. బీజేపీ పెద్దలను ఎప్పుడూ కలుస్తూనే ఉంటామన్నారు.