Andhra PradeshHome Page Slider

అప్పులు 64 కోట్లు, పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి అధికారికంగా నామినేషన్ సమర్పించారు. నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, రాబోయే ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధిస్తామని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో గత ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించిన ఆదాయం, అప్పులు, పన్ను చెల్లింపు వివరాలు వెల్లడించారు. గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆదాయాన్ని రూ.114 కోట్ల 76లక్షల 78 వేల 300గా చూపించారు. ఇందుకుగానూ, రూ.47 కోట్ల 07 లక్షల 32 వేల 875 ఆదాయపు పన్ను చెల్లించానన్నారు. జీఎస్టీ కింద 26 కోట్ల 84 లక్షల 70 వేలు చెల్లించినట్టు పేర్కొన్నారు. తనకు మొత్తం రూ.64 కోట్ల 26 లక్షల 84 వేల 453 అప్పులు ఉన్నాయని తెలిపారు. వివిధ బ్యాంకుల్లో రూ.17 కోట్ల 56 లక్షలు వ్యక్తుల నుంచి రూ.46 కోట్ల 70 లక్షలు రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. విరాళాలు 20 కోట్ల మేర చెల్లించినట్టు అఫిడవిట్‌లో పొందుపరిచారు.

పిఠాపురం నియోజక వర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి వర్మ, ఆయన సతీమణి ఆశీర్వాదం తీసుకున్నారు.