కొత్తగూడెం జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా ప్రచారంలో పవన్ కళ్యాణ్
కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే నా ఇజం.. హ్యూమనిజం అని ఆయన వ్యాఖ్యానించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచినట్లు గుర్తు చేశారు. కొత్తగూడెం జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని చెప్పారు.