Andhra PradeshBusinessHome Page Slider

అక్కడ 12 ఎకరాలు స్థలం కొన్న పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజక వర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనిని పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ స్థలాన్ని తన ఇల్లు, క్యాంపు కార్యాలయం కోసం కొన్నట్లు పవన్ పేర్కొన్నారు.  గతంలో కూడా పిఠాపురం మండలంలోని భోగాపురం, రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.