పవన్‌కళ్యాణ్-ఆద్యల సెల్ఫీ.. తల్లి రియాక్షన్?
పవన్‌కళ్యాణ్ కూతురు ఆద్య ఇండిపెండెన్స్ డే వేడుకలను చూడ్డానికి హాజరైంది. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ ఆద్యతో సరదాగా ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మెగా అభిమానులు, జనసేన శ్రేణులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా ఇదే ఫొటోపై రేణు దేశాయ్ స్పందించారు. కుమార్తెతో పవన్‌కళ్యాణ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.