ఏ రోటికాడ ఆ మాట మాట్లాడే వ్యక్తి పవన్
బుధవారం వారాహి యాత్ర సందర్భంగా మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని. పవన్ రోజుకో డైలాగ్ చెబుతాడని.. దాన్ని ఆయన వ్యూహ్యం అంటుని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఉంటే ఆ మాట.. ఇక్కడికి వస్తే మరో మాట.. ఏ రోటికాడా ఆ మాట మాట్లాడే వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. “పాలించే నాయకులకు గులాంగిరీ చేయం, బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతాను” అంటూ పవన్ నిన్న స్పీచ్‌లో అన్నారు. చంద్రబాబు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు? ఒక్క రోజైనా ఈ 9 ఏళ్లలో నరేంద్రమోదీ చేసిన పొరపాట్లకు ఎన్నిసార్లు ఆయన కోటు పట్టుకున్నావు? అని ప్రశ్నించారు. సినిమా డ్రామాలు, డైలాగులు కట్టిబెట్టు పవన్ అని సెటైర్లు వేశారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే నేను రెండుచెప్పులు చూపిస్తా అంటూ మండిపడ్డారు. ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్తారు కానీ, వ్యూహాలను నమ్ముకుంటే కాదని పేర్కొన్నారు. ఈ సొల్లు మాటల వల్ల అసెంబ్లీలో సీటు రాదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ వాళ్ల చేత “ఆంధ్ర కొడకల్లారా” అని తిట్టించుకున్న తరువాత మనకు రోషం రాకపోవడం బాధాకరమని పవన్ అనటం ఆశ్చర్యంగా ఉందిని పేర్ని నాని అన్నారు. సినిమా సినిమాకు కేసీఆర్ కాళ్లు పట్టుకునేది ఎవరని?. బీజేపీతో బంధం ఉంచుకొని కూడా కేసీఆర్‌తో అక్రమ సంబంధం పెట్టుకొని నికృష్టంగా, నిర్లజ్టగా కేసీఆర్‌కు ఓటు వేయమని అడిగేది ఎవరని, హరిష్ రావు ఏపీ ప్రజలను, రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే ఆయనపై ఈగ వాలకుండా అడ్డుపడేది ఎవరు..పవన్ కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ సినిమాలు మా ప్రభుత్వం ఏ రోజు ఆపలేదని పేర్ని నాని స్పష్టం చేశారు.

సీఎం జగన్ జనం సొమ్ము జనానికే పంచుతున్నారు అని, చంద్రబాబులాగ స్వాహా చేయలేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు “నేను ఇచ్చిన డబ్బులతో బతుకున్నారని, నేను వేసిన రోడ్లపై తిరుగుతున్నారని, నేనిచ్చిన గ్యాస్ బండ వాడుకుంటున్నారని, నేను ఇచ్చిన రేషన్ బియ్యం తింటున్నారని” హేళనగా మాట్లాడేవాడని గుర్తుచేశారు. చంద్రబాబు పచ్చగా కళకళలాడాలనే పవన్ వ్యూహమని, దాని కోసం ఏమైనా చేస్తాడని మండిపడారు.