Andhra PradeshNews Alert

వైసీపీ నేతలపై పవన్ మరో సెటైర్

పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మరే సెటైర్ వేశారు. అమెరికా సౌత్ డకోటాలో ఉన్న ‘మోంట్ రష్ మోర్’ ప్రజాస్వామ్యానికి , స్వేచ్ఛ విశ్వాసాలకు చిహ్నం అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ‘మోంట్ దిల్ మాంగ్ మోర్’  ధన-వర్గ-కులశస్వామ్యాలకి చిహ్నం అని ట్వీట్ చేశారు. ఆ కొండపై సీఎం జగన్‌తో పాటు వైసీపీ నోతలు ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే అందులో ఒకరు మరోకరితో ఈ విధంగా చెబుతారు.. “డోంట్ వర్రీ సార్, మనం కూడా కొంచెం తిట్ల పురాణం మోతాదు పెంచితే , తర్వాతి ఛాన్స్ మనదే” అని రాసిఉంటుంది.