Andhra PradeshHome Page SliderPolitics

పవన్‌కు అంబటి సెటైర్లు..గోవా వెళ్లాల్సిందే..

పవన్ కళ్యాణ్ వైసీపీ నుద్దేశించి, ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాల్సిందే. అక్కడే ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారంటూ అసెంబ్లీ ముందు వ్యాఖ్యానించారు. దీనికి సెటైర్ వేస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు చురకలంటించారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి, మీరు సీఎం కావాలంటే గోవాకి వెళ్లాల్సిందే. అక్కడే 40 స్థానాలకు 21 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. జనసేన 21  సీట్లతో ఎప్పటికీ సీఎం కాలేరు అంటూ ట్వీట్ చేశారు.