లీలా మహల్ లో పవన్ ఫ్యాన్స్ విధ్వంసం
పవర్ స్టార్ పుట్టినరోజు నాడు ఆయన అభిమానులు రచ్చరచ్చ చేశారు. విశాఖలోని లీలా మహల్ థియేటర్లో అరాచకం సృష్టించి అలజడి రేపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా లీలామహల్‌లో జల్సా సినిమా ప్రదర్శించారు. అయితే సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ అకస్మాత్తుగా బీర్ బాటిల్స్‌ను పగలగొట్టి సీసాపెంకులు విసురుతూ
బీభత్సం సృష్టించారు. స్క్రీన్ చించేశారు. సీట్లను ధ్వంసం చేసి… సీలింగ్‌ను డ్యామేజ్ చేశారు. థియేటర్ అంతా పేపర్ ముక్కలు, గాజు పెంకులతో అస్తవ్యస్తంగా మార్చేశారు.
పవన్ అభిమానుల నిర్వాకంతో థియోటర్ యజమానులు షాకయ్యారు. ” పవన్ కల్యాణ్ గారు మీ ఫాన్స్ మా కడుపులు కొట్టారు ” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.20 లక్షలు నష్టం జరిగిందని వాపోయారు. ఈఘటన కారణంగా లీలా మహల్‌లో నెలరోజుల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

