పవన్, పేర్నినానిల చెప్పుల ఫైట్
పవన్ ఒక చెప్పు చూపిస్తే, నేను రెండుచెప్పులు చూపిస్తా అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని. పవన్‌ది ‘వారాహి కాదు నారాహి’ అని ఎద్దేవా చేస్తున్నారు పేర్నినాని. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే పవన్ లక్ష్యం అంటున్నారు. బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నాడని, ఎక్కడి మాటలు అక్కడ చెపుతూ సొల్లు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి చెప్పులు చూపిస్తే మైకులు విరిగిపోతాయా? నీకన్నా పెద్ద మగాడ్ని, నేను రెండు చెప్పులు చూపిస్తా అని కౌంటర్ ఇచ్చారు. ‘చెప్పుతో కొట్టడానికి నువ్వు పెద్ద పోటుగాడివా, మేము కూడా మక్కెలిరగొడతాం’ అంటూ కౌంటర్ వేశారు. ఈసారి జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టడం తథ్యమన్న జనసేన నేత పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు పేర్నినాని. ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్తారు కానీ, వ్యూహాలను నమ్ముకుంటే కాదని పేర్కొన్నారు. ఈ సొల్లు మాటల వల్ల అసెంబ్లీలో సీటు రాదని వెటకారం చేశారు. వైసీపీని నమ్ముకుంటే కొండలు కూడా తొలిచేస్తారని పవన్ చెప్పిన మాటలకు కౌంటర్ ఇచ్చారు పేర్నినాని. పవన్ రోజురోజుకీ మాటలు మారుస్తున్నాడని, తన మాటలకు తానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

