తిరిగి 7 నుండి పవన్ ఎన్నికల ప్రచారం
అమరావతి: వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈ నెల 7న అనకాపల్లి, 8న యలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాది పర్వదినం సందర్భంగా 9న పిఠాపురంలో నిర్వహించనున్న వేడుకల్లో పవన్ పాల్గొంటారు. జ్వరం కారణంగా రెండు రోజుల క్రితం ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించిన ఆయన.. ఆదివారం నుండి యథావిధిగా తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయనున్నారు.

